పేదల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గం

ABN , First Publish Date - 2020-03-02T10:13:59+05:30 IST

భూసేకరణ పేరిట పేదలు, రైతులు సాగు చేసుకుంటున్న భుములను ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం దుర్మర్గమైన చర్య అని తెలుగు యువత జిల్లా

పేదల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గం

  • తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము

కె.కోటపాడు: భూసేకరణ పేరిట పేదలు, రైతులు సాగు చేసుకుంటున్న భుములను ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం దుర్మర్గమైన చర్య అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము అన్నారు. ఆదివారం ఆయన కోటపాడులో విలేఖరులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం పేదల వద్ద భూములను దౌర్జన్యంగా లాక్కోని పంపిణీ చేయడం సరికాదని చెప్పారు. ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న భూములను, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను స్వాధీనం చేసుకుని వేరోకరికి పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నంచారు. రాష్ట్రంలో పేదల భూముల తప్పితే వేరే భూములు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. పేదల పట్ల వైసీపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములను వదిలేసి గ్రామాల్లో జిరాయితీ భూములను కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలివ్వాలని చెప్పారు. రైతులు, పేదలు భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు, వైసీపీ నాయకులు వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ లాక్కుంటున్నారని ఆరోపించారు.పాదయాత్రలో సమస్యలను పెడచెవిన పెట్టి భూకుంభకోణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొదలు పెట్టారని తెలిపారు. టీడీపీ నాయకులు పైల నారాయణమూర్తి, పైల అప్పలనాయుడు, పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:13:59+05:30 IST