-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Is CM Jagan ready for referendum on capitals
-
రాజధానులపై రెఫరెండానికి సీఎం జగన్ సిద్ధమేనా?
ABN , First Publish Date - 2020-12-19T05:31:51+05:30 IST
మూడు రాజధానులపై రెఫరెండానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము ప్రశ్నించారు.

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము
కె.కోటపాడు, డిసెంబరు 18: మూడు రాజధానులపై రెఫరెండానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు జూరెడ్డి రాము ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రజలు మూడు రాజధానులకు మద్దతిస్తే రాజకీయాలకు స్వస్తి చెబుతానని చంద్రబాబు సవాల్ విసిరారని, ఒక్క రాజధానికి ప్రజలు మద్దతిస్తే ముఖ్యమంత్రి జగన్ రాజకీయ సన్యాసం చేస్తారాని ప్రశ్నించారు. జగన్ రాక్షస పాలనను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి, దౌర్జన్యాలు, భూకబ్జాలు అధికమయ్యాయని తెలిపారు. మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని, దళితులపై దాడులు పెరుగుతున్న పాలకులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ముఖమంత్రిలో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొరుపోలు జయరామ్, టీడీపీ జిల్లా నాయకులు బోళెం అక్కన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.