ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-31T05:17:40+05:30 IST
రక్షణ రంగం ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన రక్షణ రంగాల ఉద్యోగులకు ఫైర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రొగ్రామ్‌పై ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏయూ ప్రవేశాల డైరెక్టర్ ప్రొఫెసర్ డీఏ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏయూ క్యాంపస్, డిసెంబరు 30: రక్షణ రంగం ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన రక్షణ రంగాల ఉద్యోగులకు ఫైర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ ప్రొగ్రామ్‌పై ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏయూ ప్రవేశాల డైరెక్టర్ ప్రొఫెసర్ డీఏ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం 60 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగినవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 25 నుంచి 28వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని, 30 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరింత సమాచారం కోసం ఠీఠీఠీ.్చఠఛీ్చౌ.జీుఽ వెబ్‌సైట్‌ను తిలకించాలని కోరారు.