నిరుద్యోగ యువతకు ఉపాధి కోసమే మినీ ట్రక్కులు
ABN , First Publish Date - 2020-12-05T05:49:25+05:30 IST
రేషన్ సరకుల సరఫరాకు మినీ ట్రక్కులను వినియోగించి, తద్వారా నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి తెలిపారు.

మండల పరిషత్ కార్యాలయాల్లో అర్హుల ఎంపికకు ఇంటర్వ్యూలు
వివిధ ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల అధికారులు హాజరు
మునగపాక, డిసెంబరు 4 : రేషన్ సరకుల సరఫరాకు మినీ ట్రక్కులను వినియోగించి, తద్వారా నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి తెలిపారు. మునగపాక మండలానికి 12 వాహనాలు మంజూరుకాగా, వీటి కోసం 165 మంది దరఖాస్తులు చేసుకున్న నేపథ్యంలో వీరందరికీ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇంట ర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు విచ్చేసిన ఈడీ విలేఖర్లతో మాట్లాడారు. రేషన్ సరకులు ఇంటింటికీ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. దీనిని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్చార్జి ఎంపీడీవో ప్రసాద్, రవాణా శాఖ అధికారి సుధీర్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ చిదంబరం, తదితరులు పాల్గొన్నారు.
ఎలమంచిలి : మినీ ట్రక్కుల కోసం దరఖాస్తులు చేసిన అభ్యర్థులుకు ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలానికి.. మంజూరుకాగా, వీటి కోసం 59 మంది దరఖాస్తులు చేసుకోగా 51మంది హాజరయ్యారు. వీరికి ఎంపీడీవో సత్యనారాయణ తదిత రులు ఇంటర్వ్యూలు జరిపారు. ఈ ప్రక్రియను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి పరిశీలించారు.
రాంబిల్లి : ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో మినీ ట్రక్కులకు అర్హుల ఎంపిక నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలానికి 12 వాహనాలు మంజూరుకాగా, 123 మందికి ఎంపీడీవో హేమసుందరరావు ఇంటర్వ్యూలు జరిపారు.
మాకవరపాలెం : మండలంలో 14 మినీ ట్రక్కుల మంజూరుకు సంబంధించి నిర్వహించిన ఇంటర్వ్యూలకు 167 మంది హాజరైనట్టు ఎంపీడీవో అరుణశ్రీ తెలిపారు.
నాతవరం : ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో 15 మినీ ట్రక్కుల మంజూరుకు జరిపిన ఇంటర్వ్యూలకు 145 మంది హాజరైనట్టు ఎంపీడీవో యాదగిరేశ్వరరావు తెలిపారు.
నర్సీపట్నం/ నర్సీపట్నం అర్బన్ : మునిసిపాలిటీలోని 17 సచివాలయాల పరిధిలో రేషన్ సరకుల రవాణాకు పది మినీ వాహనాలు మంజూరు కాగా, మునిసిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిపినట్టు కమిషనర్ కనకారావు తెలిపారు. ఇందుకు తొలుత 135 మంది దరఖాస్తులు చేయగా, ఇంటర్వ్యూలకు 29 మంది గైర్హాజరైనట్టు చెప్పారు. అలాగే, నర్సీపట్నం మండలానికి ఎనిమిది వాహనాలు మంజూరు కాగా, పరిషత్ కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలకు 63 మంది హాజరైనట్టు ఎంపీడీవో జయమాధవి తెలిపారు.
గొలుగొండ : మండలానికి 13 వాహనాలు మంజూరు కాగా, తొలుత 130 మంది దరఖాస్తులు చేశారు. మం డల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలకు 88 మంది మాత్రమే హాజరైనట్టు ఎంపీడీవో డేవిడ్‌రాజ్ తెలిపారు.
నక్కపల్లి : మండలానికి 18 మినీ ట్రక్కులు మంజూరు కాగా, వీటి కోసం 152 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేశ్‌రామన్ బృందం ఇంట ర్వ్యూలు జరిపింది.
ఎస్.రాయవరం : ఈ మండలానికి 16 వాహనాలు మంజూరుకాగా, 140 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఇంటర్వూలు నిర్వహించారు.
పాయకరావుపేట : మండలానికి మంజూరైన 20 మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. మొత్తం 167 మంది దరఖాస్తులు చేయగా, 139 మంది హాజరయ్యారని ఎంపీడీవో సాంబశివరావు తెలిపారు.