రేషన్‌ డీలర్లకు బీమా కల్పించండి

ABN , First Publish Date - 2020-07-14T10:11:59+05:30 IST

కరోనా విపత్తు సమయంలో మార్చి 29 నుంచి నెలకు రెండు పర్యాయాలు రేషన్‌ పంపిణీ చేస్తున్నందున..

రేషన్‌ డీలర్లకు బీమా కల్పించండి

విశాఖపట్నం, జూలై 13(ఆంధ్రజ్యోతి): కరోనా విపత్తు సమయంలో మార్చి 29 నుంచి నెలకు రెండు పర్యాయాలు రేషన్‌ పంపిణీ చేస్తున్నందున తమకు రక్షణ కల్పించాలని రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా యంత్రాంగాన్ని కోరింది. రోజూ వందలాది మంది కార్డుదారులకు అతి సమీపంలో బియ్యం పంపిణీ చేస్తున్నందున కరోనా బారిన పడే ప్రమాదం ఉందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి డీలరుకు రూ.పది లక్షలు, సహాయకులకు రూ.ఐదు లక్షల వంతున ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు సోమవారం జాయింట్‌ కలెక్టర్‌కు రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పి.చిట్టిరాజు నేతృత్వంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-07-14T10:11:59+05:30 IST