ఇండియన్‌ ఐడిల్‌లో షణ్ముఖప్రియ

ABN , First Publish Date - 2020-11-26T04:36:28+05:30 IST

ప్రముఖ టీవీ చానల్‌ నిర్వహిస్తున్న ఇండియన్‌ ఐడిల్‌ షోకు మధురవాడకు చెందిన గాయని షణ్ముఖప్రియ ఎంపికైంది.

ఇండియన్‌ ఐడిల్‌లో షణ్ముఖప్రియ
గీతాలపన చేస్తున్న షణ్ముఖప్రియ

మధురవాడ, నవంబరు 25: ప్రముఖ టీవీ చానల్‌ నిర్వహిస్తున్న ఇండియన్‌ ఐడిల్‌ షోకు మధురవాడకు చెందిన గాయని షణ్ముఖప్రియ ఎంపికైంది. మన రాష్ట్రం నుంచి పాల్గొన్న షణ్ముఖప్రియ టాప్‌-15లో చోటు సంపాదించింది. న్యాయ నిర్ణేతలు, ప్రముఖ సంగీత దర్శకులు విశాల్‌ దద్‌లానీ, హిమేశ్‌ రేషమ్మియా, నేహాకక్కర్‌లను షణ్ముఖప్రియ తన గానామృతంతో మెప్పించి ఈ షోలో గోల్డెన్‌ మైక్‌ను సాఽధించింది. ఇండియన్‌ ఐడిల్‌ షోలో యూడిలింగ్‌ పాడిన మొట్టమొదటి అమ్మాయిగా షణ్ముఖప్రియ గుర్తింపు పొందింది. ఈ పాటను ఇప్పటికే ప్రోమోగా షో నిర్వాహకులు విడుదల చేయడంతో పలువురి సంగీతప్రియుల అభిమానాన్ని ఆమె సొంతం చేసుకుంది. ఈ నెల 28 నుంచి ప్రతీ శని, ఆదివారాల్లో సోనీ హిందీ చానల్‌లో రాత్రి ఎనిమిది గంటలకు ఇండియన్‌ ఐడిల్‌ షో ప్రసారం కానున్నది.

Read more