ఇండియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మెగా క్రికెట్‌ టోర్నీ

ABN , First Publish Date - 2020-12-27T05:51:12+05:30 IST

ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం, బ్యాంకు అధికారుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను జోనల్‌ మేనేజర్‌ రామ్‌కుమార్‌ దాస్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ పట్నాయక్‌లు మధురవాడలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభించారు.

ఇండియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మెగా క్రికెట్‌ టోర్నీ
టోర్నీలో పాల్గొన్న ఇండియన్‌ బ్యాంక్‌ అధికారులు, జట్టు సభ్యులు

సిరిపురం, డిసెంబరు 26: ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం, బ్యాంకు అధికారుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను జోనల్‌ మేనేజర్‌ రామ్‌కుమార్‌ దాస్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ పట్నాయక్‌లు మధురవాడలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో అధికారులందరూ తమ క్రీడా స్ఫూర్తిని, నైపుణ్యాన్ని కనబరిచి విజయవంతం చేయాలని కోరారు. ఇండియన్‌ బ్యాంకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు కేటీకేఎన్‌వీ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి జి.సతీశ్‌ చంద్రకుమార్‌లు విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్యాంక్‌ జోనల్‌ కార్యదర్శి టి.శివప్రసాద్‌ను అభినందించారు. అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. 

Updated Date - 2020-12-27T05:51:12+05:30 IST