సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-11-27T06:03:06+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది.

సార్వత్రిక సమ్మె విజయవంతం
పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు


పాడేరురూరల్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా ముగిసింది. పాడేరులో సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావు ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి మీదుగా ఆశ, అంగన్‌వాడీ, మిడ్డేమీల్స్‌, ఆటో, ముఠా, భవననిర్మాణ కార్మికులు, వెలుగు వీవోఏలు, హాస్టల్‌ కాఫీ కార్మికులు, పంచాయతీ, జీసీసీ, ఆస్పత్రి, మార్కెట్‌యార్డు కార్మికులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్‌.శంకరరావు, పాలికి లక్కు, రాధాకృష్ణ, భాగ్యలక్ష్మి, మంగమ్మ, దాసమ్మ, భాను, కాంతమ్మ, సరస్వతి, పుణ్యవతి, రాజు, మాలిబాబు, గౌరినాయుడు, బాషా, నరసయ్య, వరహాలు, చలపతి, ప్రభు పాల్గొన్నారు.


Read more