మంచు ముసుగులో ముంచంగిపుట్టు
ABN , First Publish Date - 2020-12-20T05:58:24+05:30 IST
మండలంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం 11 గంటల వరకు పొగమంచు వీడలేదు.

ముంచంగిపుట్టు, డిసెంబరు 18: మండలంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం 11 గంటల వరకు పొగమంచు వీడలేదు. దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం అధికంగా ఉంటుంది. తాజా వాతావరణం పర్యాటకులకు ఆనందంగా ఉండగా, స్థానికులకు మాత్రం ఇబ్బందిగానే ఉంది.