-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » IMA
-
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుబ్రహ్మణ్యం
ABN , First Publish Date - 2020-11-22T05:05:52+05:30 IST
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఏపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా న్యూరో సర్జరీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఏపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా న్యూరో సర్జరీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. విశాఖ ఐఎమ్‌ఏ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరో వార్షిక సమావేశం శనివారం వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై నగరం నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గౌరవ అతిథులుగా మంత్రి డాక్టర్ ఎస్.అప్పలరాజు, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, డాక్టర్ బి.వి.సత్యవతి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్యరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తాను సభ్యులందరి సంక్షేమ, రక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వంతో ఐఎంఏ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకువచ్చారు. ఈ వర్చువల్ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.విజయ్‌శేఖర్, కార్యదర్శి డాక్టర్ ఎల్.కల్యాణ్‌ప్రసాద్, డాక్టర్ ఐ.వాణి పాల్గొన్నారు.