44 రోజులు.. రూ.1,75,79,073.!

ABN , First Publish Date - 2020-12-18T05:07:32+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 44 రోజుల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం దేవస్థానం ఖజానాకు సమకూరింది.

44 రోజులు.. రూ.1,75,79,073.!
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం

ఇదీ అప్పన్న స్వామి హుండీ ఆదాయం

సింహాచలం, డిసెంబరు 17: వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 44 రోజుల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం దేవస్థానం ఖజానాకు సమకూరింది. ఈవో వి.త్రినాథరావు పర్యవేక్షణలో గురువారం బేడా మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.1,75,79,073, ఆభరణాల రూపంలో స్వర్ణం 208.07 గ్రాములు, రజితం 11.4 కిలోలు లభించింది. అలాగే యూఎస్‌ఏకు చెందిన 115 డాలర్లు, కెనడావి పది డాలర్లు, యూఏఈకి చెందిన 25 దీరమ్స్‌, తదితర విదేశీ కరెన్సీ కూడా అప్పన్న ఖజానాకు చేరింది. హుండీల లెక్కింపునకు జిల్లా దేవదాయశాఖ ఏసీ కార్యాలయ పర్యవేక్షణాధికారి సుధారాణి ప్రత్యేక పర్యవేక్షకురాలిగా హాజరవ్వగా ఏఈవోలు, పలువురు ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు.




Updated Date - 2020-12-18T05:07:32+05:30 IST