మానవులకు హక్కులతో పాటు బాధ్యతలు

ABN , First Publish Date - 2020-12-11T04:10:50+05:30 IST

సమాజంలో మానవులకు హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని ప్రఖ్యాత మానవ హక్కుల కార్యకర్త షీలా బర్సే అన్నారు.

మానవులకు హక్కులతో పాటు బాధ్యతలు
షీలా బర్సేను జ్ఞాపికతో సత్కరిస్తున్న వీసీ సూర్యప్రకాశ్‌

ప్రఖ్యాత మానవ హక్కుల కార్యకర్త షీలా బర్సే



సబ్బవరం, డిసెంబరు 10 : సమాజంలో మానవులకు హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని ప్రఖ్యాత మానవ హక్కుల కార్యకర్త షీలా బర్సే అన్నారు. సబ్బవరంలోని దామోదం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యా లయంలో గురువారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా షీలా బర్సే ఒక రోజు వెబ్‌నార్‌ను నిర్వ హించి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిని మానవ హక్కుల పుట్టుకగా మనం చూడకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన చరిత్ర, సంస్కృతి, వారత్వం లోనే హక్కుల గురించి ప్రస్తావించారన్నారు. మరో అతిథి న్యూఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ సిన్హా మానవ హక్కులపై మొట్టమొదటి అంతర్జాతీయ పత్రాన్ని రూపొందించడంలో మహిళల గణనీయమైన కృషిని వివరించారు. అంతకు ముందు వీసీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం షీలా బార్సే చేసిన కృషి ఎనలేదన్నారు. ఈ సందర్భంగా వీసీ సూర్యప్రకాశ్‌ ముఖ్య అతిథులను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో  రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భవానీ ప్రసాద్‌ పాండా, డాక్టర్‌ దయానందమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T04:10:50+05:30 IST