‘ఆస్తి పన్ను పెంపు జీవోలు వెనక్కి తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-12-15T05:54:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంచుతూ ఇచ్చిన జీవోలు 196, 197, 198లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి డిమాండ్‌ చేశారు.

‘ఆస్తి పన్ను పెంపు జీవోలు వెనక్కి తీసుకోవాలి’

నర్సీపట్నం, డిసెంబరు14 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంచుతూ ఇచ్చిన జీవోలు 196, 197, 198లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులపై మూడు నుంచి పది రెట్లు భారం పడుతుందన్నారు. ప్రతి సంవత్సరం మార్కెట్‌ విలువ పెరిగినప్పుడు పన్నులు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మునిసిపల్‌ మేనేజర్‌ రాఘవాచారికి వినతి పత్రం అందజేశారు. సంఘం కార్యదర్శి కె.శివనారాయణరాజు, కన్నయ్యశెట్టి, సీఐటీయూ నాయకుడు డి.సత్తిబాబు, అడిగర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T05:54:27+05:30 IST