-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » house sites distribution
-
‘రావణాపల్లి’ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పర్యటన
ABN , First Publish Date - 2020-12-31T05:25:44+05:30 IST
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బుధవారం మండలంలోని రావణాపల్లి పంచాయతీలో పర్యటించారు.

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ
కొయ్యూరు, డిసెంబరు 30: పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బుధవారం మండలంలోని రావణాపల్లి పంచాయతీలో పర్యటించారు. సుమారు 100 మందికి ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశారు. చింతలపూడి ఆర్‌బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తోటలూరు గ్రామంలో ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎరుకుల సమస్యలను ఏకలవ్య ఎరుకుల చైతన్య సంక్షేమ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గంటా చిరంజీవి, నాగళ్ల సింహాచలం ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి రవీంద్రనాథ్, తహసీల్దారు శ్రీధర్, ఏవో కృష్ణవేణి, చింతపల్లి ఏఎంసీ చైర్‌పర్సన్ హలియారాణి, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, వైసీపీ నాయకులు వారా నూకరాజు, ఎస్.సూరిబాబు, గజ్జియ్యదొర, అప్పన రమణ, జల్లి బాబులు, సుధాకర్, బడుగు రమేశ్, కాంతమ్మ, పొడుగు చంద్రరావు, రాజులమ్మ తదితరులు
అనంతగిరిలో ఇళ్ల పట్టాలు పంపిణీ
అనంతగిరి, డిసెంబరు 30: అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ బుధవారం అనంతగిరిలో 17 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు మంజూరుకాని వారిలో అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే త్వరలో పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, తహసీల్దార్ ప్రసాద్, డీటీ లత్సాపాత్రుడు, ఆర్‌ఐ మహదేవ్, వైసీపీ నాయకులు శెట్టి ఆనంద్, సూర్యనారాయణ, స్వామి, తడబారికి మితుల, గంగులుతదితరులు పాల్గొన్నారు.
లక్కవరపుపేటలో 74 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు
గూడెంకొత్తవీధి: మండలంలోని లక్కవరపుపేటలో బుధవారం 74 మందికి ఎంపీడీవో చంద్రశేఖరరావు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. స్థలాలు పొందిన వారందరికీ త్వరలో పక్కా ఇళ్లు మంజూరు అవుతాయని ఆయన చెప్పారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.