పట్టాదారులందరికీ త్వరలో పక్కా ఇళ్లు మంజూరు

ABN , First Publish Date - 2020-12-30T06:07:25+05:30 IST

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. మండలంలోని ధర్మసాగరంలో మంగళవారం 111 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.

పట్టాదారులందరికీ త్వరలో పక్కా ఇళ్లు మంజూరు
నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌


ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేశ్‌


 నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 29: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. మండలంలోని ధర్మసాగరంలో మంగళవారం 111 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పట్టాలు పొందుతున్న వారందరికీ త్వరలో పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, తహసీల్దార్‌ కె.జయ, ఎంపీడీవో జయమాధవి, వైసీపీ మండల అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, నాయకులు గొంప కన్నయ్యనాయుడు, నిద్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


చమ్మచింతలో 117 మందికి పట్టాలు పంపిణీ

నాతవరం: మండలంలోని చమ్మచింతలో మంగళవారం 117 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టాలు పొందినవారికి త్వరలో ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.జానకమ్మ మాజీ సర్పంచ్‌ వెలగడ కొండతల్లి,  మైనం నాగగోపి,తదితరులు పాల్గొన్నారు. 


చిన్నయ్యపాలెంలో 19 మందికి....

గొలుగొండ: మండలంలోని చిన్నయ్యపాలెంలో 19 మంది లబ్ధిదారులకు డిఫ్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌, వైసీపీ నాయకులు పోలిరెడ్డి రాజుబాబు, సింగంపల్లి చిన్నయ్యనాయుడు, పోతల వెంకునాయుడు చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.


జంగాలపల్లిలో 15 మందికి..

మాకవరపాలెం: మండలంలోని జంగాలపల్లిలో 15 మంది లబ్ధిదారులకు తహసీల్దార్‌ రాణిఅమ్మాజీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుందని, ఇంకా అర్హులైన వారెవరైనా వుంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీ చయనులు, ఆర్‌ఐ నరేంద్ర, వీఆర్‌వోలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T06:07:25+05:30 IST