-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Hospital Development
-
ప్రాంతీయ ఆస్పత్రి విస్తరణ పనులకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-11-28T04:44:35+05:30 IST
ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రి విస్తరణ పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేసి, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.

నర్సీపట్నం, నవంబరు 27 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రి విస్తరణ పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేసి, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పారు. ఆస్పత్రిలోని పార్కింగ్ ప్రాంతంలో రూ.8.88 కోట్లు వెచ్చించి జి+2 భవన నిర్మాణం చేయనున్నట్టు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మణరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 150 పడకల ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు సరిపడా మౌలిక వసతులు లేనందున విస్తరణ పనులకు నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఉమేష్‌కుమార్, డీఈఈ నాగేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.