పేదలందరికి ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-12-26T06:17:46+05:30 IST

పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరకి ఇళ్ల స్థలాల పట్టాలివ్వడం జరుగుతుందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు.

పేదలందరికి ఇళ్ల స్థలాలు
లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు,ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు


కె.కోటపాడు, డిసెంబరు 25: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరకి ఇళ్ల స్థలాల పట్టాలివ్వడం జరుగుతుందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం కొరువాడలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 33 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బూడి మాట్లాడుతూ.. అర్హులందరికీ సొంతంటి కల నెరువేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి అనిత, వైసీపీ మండల అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్‌, తహసీల్దార్‌ మర్రి లక్ష్మి, వైసీపీ మండల నాయకులు చీపురుపల్లి అచ్చిబాబు, ఈర్లె అనురాధ, గొరుపోటు వెంకటరావు, చల్లా సత్యనారాయణమూర్తి, ఈర్లె నాని, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-26T06:17:46+05:30 IST