అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

ABN , First Publish Date - 2020-12-30T05:13:56+05:30 IST

అర్హులందరికీ ఇళ్ల పట్టాలను అందజేసి సొంతింటి కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు.

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు
పెదముషిడివాడలో లబ్ధిదారులకు పట్టాలను అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌



లంకెలపాలెం, డిసెంబరు 29: అర్హులందరికీ ఇళ్ల పట్టాలను అందజేసి సొంతింటి కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మంగళవారం పెదముషిడివాడ, మడకపాలెం గ్రామాల్లో 286 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసి, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టాలు రాని అర్హులైన లబ్ధిదారులంతా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా చేతికి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్‌ రాణి, ఎంపీడీవో హేమసుందర్‌, వైసీపీ నాయకులు భగవాన్‌ జయరాం, పైలా సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.


సబ్బవరంలో..

సబ్బవరం : ఇళ్ల పట్టాల్లో ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించి వారికీ ఇంటి స్థలం మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ సూచించారు. అవసరమైతే కలెక్టర్‌తో మాట్లాడాలని సూచించారు. మండలంలోని మొగలిపురంలో మంగళవారం మొగలిపురంలో 95 మందికి, గుల్లేపల్లి 61, బోదివలస 33, అంతకాపల్లి 81, పెదయాతపాలెం 99, బంగారమ్మపాలెం 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ సూర్యకళ, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో రమేశ్‌నాయుడు, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌టీ రామకాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:13:56+05:30 IST