హోంగార్డు నారాయణమూర్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-03-16T07:01:25+05:30 IST
గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని కొంత నగదు, సెల్‌ఫోన్ తీసుకుని వదిలేసిన ఓ హోంగార్డుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని వదిలేసినందుకు..
వెంకన్నపాలెం వద్ద పోలీసు తనిఖీల్లో వెల్లడైన బుచ్చెయ్యపేట హోంగార్డు నిర్వాకం
చోడవరం, మార్చి 15: గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని కొంత నగదు, సెల్‌ఫోన్ తీసుకుని వదిలేసిన ఓ హోంగార్డుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గాజువాకకు చెందిన గున్నం శేఖర్ అనే వ్యక్తి 12 కిలోల గంజాయి ప్యాకెట్లతో ద్విచక్ర వాహనంపై పాడేరు ఏజెన్సీ నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి వెళుతున్నాడు. బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు నారాయణమూర్తి వడ్డాది నుంచి నిందితుడిని వెంబడిస్తూ చోడవరం సమీపంలోని బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ వద్ద శేఖర్‌ను పట్టుకున్నాడు. అయితే తన వద్ద ఎక్కువగా నగదు లేదని చెప్పడంతో అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకున్న హోంగార్డు, నగదు ఇచ్చి సెల్‌ఫోన్లు తీసుకు వెళ్లాలని చెప్పి శేఖర్‌ని విడచిపెట్టేశారు. అయితే హోంగార్డు వదిలేసిన అదే వ్యక్తి శేఖర్ వెంకన్నపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసులకు పట్టుబడిన నిందితుడు, తన వద్ద డబ్బులు సెల్‌ఫోన్ తీసుకుని మళ్లీ ఎందుకు పట్టుకున్నారంటూ పోలీసులతో వాదనకు దిగాడు. దీంతో హోంగార్డు నిర్వాకం బయటపడింది. దీనితో వెంకన్నపాలెం వద్ద గంజాయి తరలిస్తున్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఈ సమాచారాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో హోంగార్డు పాత్రపై విచారణ జరిపిన పోలీసులు, ఆ వ్యక్తి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడు శేఖర్‌తోపాటు, హోంగార్డుపైనా కూడా కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
హోంగార్డు నారాయణమూర్తి గతంలో కూడా ఇదేవిధంగా కొన్ని కేసుల్లో అక్రమాలకు పాల్పడుతుండడంతో అతనిని పనిష్మెంట్‌పై ఏజెన్సీ ప్రాంతానికి బదిలీచేసినట్టు సమాచారం. ఇటీవల ఏజెన్సీ నుంచి మళ్లీ మైదాన ప్రాంతానికి వచ్చిన నారాయణమూర్తి బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.