రైతుబజార్లకు సెలవు రేపు

ABN , First Publish Date - 2020-03-21T10:22:22+05:30 IST

నగరంలోని రైతుబజార్లను ఆదివారం మూసివేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రైతుబజార్లకు సెలవు రేపు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) :  నగరంలోని రైతుబజార్లను ఆదివారం  మూసివేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిలో వున్నందున, నిరోధక చర్యల్లో భాగంగా జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలన్నింటినీ మూసివేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కూరగాయలు అవసరమైనవారు శనివారం కొనుగోలు చేసుకోవాలని, ఆదివారం సెలవు తరువాత యథా ప్రకారం సోమవారం రైతుబజార్లు తెరుస్తామని వివరించారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు వుంటే వైద్యులను సంప్రతించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం 9666556597కు ఫోన్‌ చేయాలని, అదే ఆరోగ్య సలహా కోసమైతే 104కు కాల్‌ చేయాలని సూచించారు. 

Updated Date - 2020-03-21T10:22:22+05:30 IST