అన్యమత దాడులపై హిందువులు సంఘటితం కావాలి
ABN , First Publish Date - 2020-12-12T04:39:30+05:30 IST
రాష్ట్రంలోని పలు దేవాలయాలపై అనేక రూపాల్లో జరుగుతున్న అన్యమత దాడుల పట్ల హిందువులంతా సంఘటితం కావాలని శ్రీకాకుళంలోని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి కోరారు.
నైమిశారణ్యపీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి
సింహాచలం, డిసెంబరు 11: రాష్ట్రంలోని పలు దేవాలయాలపై అనేక రూపాల్లో జరుగుతున్న అన్యమత దాడుల పట్ల హిందువులంతా సంఘటితం కావాలని శ్రీకాకుళంలోని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి కోరారు. వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రథం దగ్ధం, దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమార్హం కాదన్నారు. ఇటువంటి అన్యమత ప్రేరేపిత దాడుల పట్ల హిందువులు అప్రమత్తతతో మెలగి, కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనా విపత్తు నుంచి సమజాన్ని కాపాడాలని అప్పన్నస్వామిని వేడుకున్నట్టు ఆయన తెలిపారు.