చింతపల్లి,జీకేవీధిల్లో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-05-17T08:40:51+05:30 IST
చింతపల్లి, జీకేవీధి మండలాల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది.

పలుచోట్ల కూలిన వృక్షాలు
చింతపల్లి: చింతపల్లి, జీకేవీధి మండలాల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. స్థానిక సీహెచ్‌సీ వద్ద ఆగివున్న రెండు అంబులెన్స్‌లపై వృక్షం కొమ్మలు విరిగిపడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే ఆర్‌ఏఆర్‌ఎస్, పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం వద్ద వృక్షాలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సకాలంలో స్పందించిన ఈపీడీసీఎల్ సిబ్బంది వృక్షాలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.