-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » hats off patel
-
చిరస్మరణీయుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్
ABN , First Publish Date - 2020-10-31T05:30:00+05:30 IST
ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచిపోయే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు
పెదవాల్తేరు, ఆక్టోబర్ 31: ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచిపోయే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంత్యుత్సవంలో ఆయన మాట్లాడుతూ 562 సంస్థానాలను పటేల్ తన చాణక్య నీతితో విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేశారన్నారు. ఎంతోమంది మహనీయుల పోరాట ఫలితంగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎం.రవీంద్ర, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ద లక్ష్మీనారాయణ, దామోదర్ యాదవ్, వి.లలిత, ఎన్‌వీఎస్ దిలీప్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.