ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల్లో ఆనందం

ABN , First Publish Date - 2020-12-30T05:28:31+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం జి.కొత్తపల్లి కేజీబీవీ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో 14 పంచాయతీలకు చెందిన 505 పట్టాలను ఆయన అందజేశారు.

ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల్లో ఆనందం
ఇళ్ల పట్టాలు అందజేస్తున్న ముత్యాలనాయుడు


ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు

చీడికాడ, డిసెంబరు 29: ఇళ్ల పట్టాల పంపిణీతో పేదల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం జి.కొత్తపల్లి కేజీబీవీ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో 14 పంచాయతీలకు చెందిన 505 పట్టాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హుడై ఉండి ఎవరికైనా పట్టా రాకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లోనే పట్టా మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారిణి ఎస్‌డీ.అనిత, తహసీల్దార్‌ అంబేడ్కర్‌, ఎంపీడీవో జయప్రకాశరావు, వైసీపీ నాయకులు యర్రా అప్పారావు, లాలం జానకిరామ్‌, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ ఎస్‌.సూర్యనారాయణ, నిర్వాహకులు పుట్టా రామ్‌కుమార్‌, కొల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:28:31+05:30 IST