మంచు దుప్పటి
ABN , First Publish Date - 2020-12-29T06:23:34+05:30 IST
పారిశ్రామిక ప్రాంతాన్ని సోమవారం ఉదయం పొగమంచు దుప్పటిలా కప్పేసింది
పారిశ్రామిక ప్రాంతాన్ని సోమవారం ఉదయం పొగమంచు దుప్పటిలా కప్పేసింది. చలికాలం ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా పొగమంచుతో రహదారి నిండిపోవడంతో వేకువజామునే మార్నింగ్ వాక్‌కు వచ్చిన వారు, ఏ షిఫ్ట్‌కు వెళ్లే పరిశ్రమల ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారు. రహదారులపై పట్టపగలు లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించినప్పటికీ, ఎదుటి వాహనాన్ని గుర్తించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ రహదారిలో ప్రయాణించేందుకు వెనుకంజ వేశారు.
-కూర్మన్నపాలెం