జీవీఎంసీ బడ్జెట్ రూ.3,600 కోట్లు?
ABN , First Publish Date - 2020-12-13T06:28:55+05:30 IST
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు 2021-22 బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ముసాయిదా సిద్ధం చేస్తున్న అధికారులు
గత ఏడాది కంటే రూ.500 కోట్లు తక్కువ
విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు 2021-22 బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన అధికారులు బడ్జెట్ అటు ఇటుగా రూ.3,600 కోట్ల వరకూ వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. 2020-21 బడ్జెట్‌తో పోల్చితే ఇది రూ.500 కోట్లు తక్కువ. ఇంజనీరింగ్ విభాగానికి గత ఏడాది రూ.1,500 కోట్లు కేటాయింపులు జరపగా, ఈసారి రూ.1,300 కోట్లకు తగ్గించాలని భావిస్తున్నారు. విద్యా విభాగానికి గత ఏడాది రూ.200 కోట్లు కేటాయించగా, ఇప్పుడు దీనిని రూ.100 కోట్లకు తగ్గించనున్నారు. బడ్జెట్ ముసాయిదాను వచ్చే వారం కమిషనర్‌కు నివేదించనున్నారు. కమిషనర్ అన్ని విభాగాల అధిపతులతో సమావేశమై ముసాయిదాలో మార్పులు,చేర్పులు చేసి, వచ్చే నెలలో ప్రత్యేక అధికారి ఆమోదం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు.