-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » GVMC
-
‘నాడు-నేడు’ ప్రణాళికలను రూపొందించాలి
ABN , First Publish Date - 2020-12-06T05:43:48+05:30 IST
విద్యార్థులను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చే ఫిబ్రవరి నాటికి నాడు-నేడు పథకం ప్రణాళికలను రూపొందించాలని జీవీఎంసీ పాఠశాలల హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు కమిషనర్ డాక్టర్ జి.సృజన సూచించారు.

జీవీఎంసీ కమిషనర్ సృజన
సిరిపురం, డిసెంబరు 5: విద్యార్థులను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చే ఫిబ్రవరి నాటికి నాడు-నేడు పథకం ప్రణాళికలను రూపొందించాలని జీవీఎంసీ పాఠశాలల హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు కమిషనర్ డాక్టర్ జి.సృజన సూచించారు. శనివారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావుతో కలిసి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాడు-నేడు’లో ప్రధాన భాగస్వాములైన తల్లిదండ్రుల కమిటీలకు విద్యార్థులకు అవసరమయ్యేలా నూతన ప్రణాళికలను రూపొందించడంపై అవగాహన కల్పించాలన్నారు. బాల (బిల్డింగ్ ఏక్ ఏ లెర్నింగ్ ఎయిడ్ ) విధానంలో ప్రణాళికలను రూపొందించాలని, అప్పుడే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా జీవీఎంసీ పాఠశాలలు ఉంటాయని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
====