-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » gvmc
-
అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న స్పెషల్‌డ్రైవ్
ABN , First Publish Date - 2020-11-25T05:51:47+05:30 IST
జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపడుతున్న స్పెషల్‌డ్రైవ్ మంగళవారం కూడా కొనసాగింది

విశాఖపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపడుతున్న స్పెషల్‌డ్రైవ్ మంగళవారం కూడా కొనసాగింది. డీసీపీ డి.రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది రుషికొండ తీరంలో సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా రెండు స్థలాల్లో నిర్మించిన ప్రహరీలతోపాటు షెడ్లను తొలగించారు. ఎంవీపీ కాలనీ ఏఎస్‌రాజా కాలేజీ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించారు. జోన్-3 పరిధి వెంకటేశ్వర మెట్ట వద్ద సెల్లార్‌లో నిర్మించిన ఫ్లాట్‌ను తొలగించారు. నాతయ్యపాలెం వద్ద అనుమతిలేకుండా భవనంపై పెంట్‌హౌస్ నిర్మించగా, దానిని తొలగించారు. చినముషిడివాడలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న మూడో అంతస్థు పిల్లర్లను కూల్చివేశారు.