గ్రామ సచివాలయాల రికార్డులు తనిఖీ
ABN , First Publish Date - 2020-11-03T05:43:31+05:30 IST
జీవీఎంసీ 70వ వార్డులోని గ్రామ సచివాలయాలను జీవీఎంసీ కమిషనర్ సృజన సోమవారం సాయంత్రం సందర్శించారు. వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఆటోనగర్: జీవీఎంసీ 70వ వార్డులోని గ్రామ సచివాలయాలను జీవీఎంసీ కమిషనర్ సృజన సోమవారం సాయంత్రం సందర్శించారు. వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సచివాలయాలలో నిర్వహిస్తున్న పలు శాఖలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. అటువంటి నిర్మాణాల సమాచారాన్ని ఆన్‌లైన్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట జోనల్ కమిషనర్ శ్రీధర్, శానిటరీ సిబ్బంది వున్నారు.