భైరవస్వామికి గుమ్మడి దీపాలు
ABN , First Publish Date - 2020-11-16T05:16:35+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామికి పెద్దసంఖ్యలో భక్తులు గుమ్మడి దీపాలతో నీరాజనాలు సమర్పించారు.

సింహాచలం, నవంబరు 15: వరాహలక్ష్మీనృసింహస్వామి ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామికి పెద్దసంఖ్యలో భక్తులు గుమ్మడి దీపాలతో నీరాజనాలు సమర్పించారు. అమావాస్య సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమృత కలశాలను సమర్పించి, గుమ్మడికాయలలో దీపాలు వెలిగించారు.