గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-22T05:01:19+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా పని చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి పి.సోమయాజులు తెలిపారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

మద్దిలపాలెం, నవంబరు 21: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా పని చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి పి.సోమయాజులు తెలిపారు. ఆంగ్లం-4, గణితశాస్త్రం-6, వృక్షశాస్త్రం-3, జంతుశాస్త్రం-10, భౌతికశాస్త్రం-5, రసాయనశాస్త్రం-2, పౌరశాస్త్రం-4, ఆర్థికశాస్త్రం-4, వొకేషనల్‌లో ఓఏఎస్‌-1, సీఎస్‌ఈ-1, ఈఈటీ-1, ఎంఎల్‌టీ-2, ఎంపీహెచ్‌డబ్ల్యు-2, పీటీ-1, ప్రింట్‌ టెక్నాలజీ-1, సీపీఅండ్‌ఎం-1 ఖాళీలను గెస్ట్‌ ఫ్యాకల్టీల ద్వారా భర్తీ చేస్తామన్నారు. విశ్రాంత అధ్యాపకులు, స్కూల్‌ అసిస్టెంట్లు, లెక్చరర్లు, పీజీ, డిగ్రీ కనీసం 50 శాతంతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా తమ దరఖాస్తులను బయోడేటా, ధ్రువపత్రాలతో నగరంలోని పిఠాపురంకాలనీలో ఉన్న జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Read more