పదిన్నర తులాల బంగారం చోరీ

ABN , First Publish Date - 2020-11-13T06:02:35+05:30 IST

నగరంలోని రామ్‌నగర్‌లో ఒక ఇంట్లో పదిన్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

పదిన్నర తులాల బంగారం చోరీ

మద్దిలపాలెం, నవంబరు 12: నగరంలోని రామ్‌నగర్‌లో ఒక ఇంట్లో పదిన్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ గ్రిల్స్‌ తొలిగించి దొంగలు చోరికి పాల్పడ్డారు. మూడో పట్టణ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం బాలసోర్‌కు చెందిన దరసాహూ నగరంలోని రామ్‌నగర్‌లో నివాసముంటూ లడ్డూ గోపాల్‌ స్వీట్‌ స్టాల్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల రెండున కుటుంబంతో సహా బాలసోర్‌కు వెళ్లాడు. గురువారం తిరిగి ఇంటికి వచ్చాక వంటగది కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఉన్నట్టు గుర్తించి ఆందోళనతో సాహూ బీరువా తెరిచి చూడగా పదిన్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-13T06:02:35+05:30 IST