ఒత్తిళ్లతో మనుగడ సాగిస్తున్న జంతువులు

ABN , First Publish Date - 2020-12-13T05:41:45+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు మానవ జీవితంపై వివిధ ఒత్తిళకలకు కారణమవుతున్నట్టుగానే భారీ కాయంతో ఉండే ఏనుగు నుంచి చిన్నపాటి ఈగ వరకు అన్ని జీవులు ఒత్తిళ్ల మధ్య మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సులో జీవ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఒత్తిళ్లతో మనుగడ సాగిస్తున్న జంతువులు

‘గీతం’ జాతీయ సదస్సులో జీవ శాస్త్రవేత్తలు

సాగర్‌నగర్‌, డిసెంబర్‌ 12: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు మానవ జీవితంపై వివిధ ఒత్తిళకలకు కారణమవుతున్నట్టుగానే భారీ కాయంతో ఉండే ఏనుగు నుంచి చిన్నపాటి ఈగ వరకు అన్ని జీవులు ఒత్తిళ్ల మధ్య మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సులో జీవ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బయో టెక్నాలజీ విభాగం నిర్వహించిన ఈ సదస్సు శనివారంతో ముగిసింది. అడవులలో ఉండే ఏనుగులపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో అమెరికాలోని నేషనల్‌ జూ అండ్‌ కన్జర్వేషన్‌ బయోలజీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకురాలు డాక్టర్‌ సంజీతాశర్మ వివరించారు. ఏనుగులు తరచూ జనారణ్యంలోకి రావడానికి కారణం ఆహారం, నీరు లభించకపోవడమేనన్నారు.ఇంకా సదస్సులో ప్రఖ్యాత సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధన కేంద్రం డైరక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా, డాక్టర్‌ అనిందితాబాద్రో, డాక్టర్‌ వినితాగౌడ్‌, గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.శరత్‌చంద్రబాబు, తదితరులు జీవరాశులపై వాతావరణ మార్పులు, ఒత్తిళ్లు ఎటువంటి మార్పులు తెస్తున్నాయో వివరించారు.

Updated Date - 2020-12-13T05:41:45+05:30 IST