‘గీతం’లో 108 మంది విదేశీ విద్యార్థుల చేరిక

ABN , First Publish Date - 2020-11-27T05:27:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 27 దేశాలకు చెందిన 108 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు అంతర్జాతీయ విద్యా విభాగం డైరెక్టర్‌ కేపీ కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

‘గీతం’లో 108 మంది విదేశీ విద్యార్థుల చేరిక

సాగర్‌నగర్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 27 దేశాలకు చెందిన 108 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు అంతర్జాతీయ విద్యా విభాగం డైరెక్టర్‌ కేపీ కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ‘గీతం’లో ప్రవేశానికి సుమారు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలో ఉత్తీర్ణులైన 108 మందికి తొలివిడిత ప్రవేశాలు కల్పించామన్నారు. వీరిలో ఆఫ్ఘనిస్తాన్‌, బూటాన్‌, నేపాల్‌, నైజీరియా, రువాండా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన వారున్నారన్నారు. కొత్తగా చేరిన వీరితో ‘గీతం’లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 300కు చేరిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-27T05:27:23+05:30 IST