నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్న బాలిక.. మందలించిన తల్లి.. చివరకు..

ABN , First Publish Date - 2020-08-01T18:34:55+05:30 IST

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మురళీనగర్‌ బ్యాంకు వీధికి చెందిన యల్లంకి క్రాంతి కుమార్తె శోభిత(17) నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండడం బ్యాంకు

నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్న బాలిక.. మందలించిన తల్లి.. చివరకు..

ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య


తాటిచెట్లపాలెం(విశాఖ): తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మురళీనగర్‌ బ్యాంకు వీధికి చెందిన యల్లంకి క్రాంతి కుమార్తె శోభిత(17) నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండడం బ్యాంకు ఉద్యోగి అయిన ఆమె తల్లి క్రాంతి గమనించింది. దీంతో అది సరికాదంటూ కూతురిని గురువారం రాత్రి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శోభిత పడక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి చీర కట్టి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. శుక్రవారం తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2020-08-01T18:34:55+05:30 IST