గిరి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN , First Publish Date - 2020-11-13T06:10:02+05:30 IST

స్వయం సహాయక సంఘాల్లో ఉన్న గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస షెట్టి అన్నారు.

గిరి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.2.48 కోట్ల చెక్‌ను అందిస్తున్న యూబీఐ జీఎం

యూబీఐ జీఎం బి.శ్రీనివాస షెట్టి

పాడేరు, నవంబరు 12: స్వయం సహాయక సంఘాల్లో ఉన్న గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస షెట్టి అన్నారు. ఏజెన్సీలో జి.మాడుగుల, పాడేరు బ్రాంచ్‌లను సందర్శించిన ఆయన ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.2.48 కోట్ల రుణాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌ ఏకే.ప్రవీణ్‌కుమార్‌, వెలుగు డీపీఎం కె.సత్యంనాయుడు, ఏరియా కో-ఆర్డినేటర్‌ నీలాచలం పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:10:02+05:30 IST