గీతం ఆస్పత్రిలో 19 మంది కరోనా అనుమానితులకు చికిత్స

ABN , First Publish Date - 2020-04-08T10:12:34+05:30 IST

గీతం ఆస్పత్రిలో 19 మంది కరోనా వైరస్‌ అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు.

గీతం ఆస్పత్రిలో 19 మంది కరోనా అనుమానితులకు చికిత్స

ఎండాడ: గీతం ఆస్పత్రిలో 19 మంది కరోనా వైరస్‌ అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. వీరి కోసం 50 మంది వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల పరిస్థితిపై వైద్యులు ప్రతీ రోజూ సమీక్షించడంతో పాటు వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.


కోరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, చివరి విడత పరీక్షల అనంతరం కొద్ది రోజుల్లో వీరిని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా బాధితుల కోసం ఆస్పత్రిలో 160కి పైగా ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచారు. అవసరమైతే హాస్టళ్లను కూడా కేటాయించాలని అధికారులను గీతం అఽధ్యక్షుడు శ్రీభరత్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-04-08T10:12:34+05:30 IST