-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Geeta karmkulu
-
గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-19T05:53:33+05:30 IST
మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3,899 ఎకరాల భూములను విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్లు గీతపై ఆధారపడ్డ గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా నేత అప్పలరాజు డిమాండ్ చేశారు.

నక్కపల్లి, డిసెంబరు 18 : మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3,899 ఎకరాల భూములను విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్లు గీతపై ఆధారపడ్డ గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా నేత అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం రాజయ్యపేటలో కల్లుగీత కార్మికులు చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. కారిడార్ కారణంగా వృత్తి కోల్పోయిన రజకులు, గీత కార్మికులు, మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులకు, దళితులు, ఇతర పేదలందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభు త్వం ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. గీత కార్మిక సంఘం ప్రతినిధులు పి.మాధవస్వామి, డి.రాజు, సీపీఎం మండల కన్వీనర్ ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.