నేవీ డే సందర్భంగా ప్రతిభను చాటిన మైక్రో ఆర్టిస్ట్
ABN , First Publish Date - 2020-12-02T22:31:06+05:30 IST
డిసెంబర్ 3న ‘నేవీ డే’ సందర్భంగా విశాఖకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విజేత డాక్టర్ గట్టెం వెంకటేశ్ తన ప్రతిభను చాటారు.
విశాఖ: డిసెంబర్ 3న ‘నేవీ డే’ సందర్భంగా విశాఖకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విజేత డాక్టర్ గట్టెం వెంకటేశ్ తన ప్రతిభను చాటారు. నేవీకి గుర్తుగా పెన్సిల్ మొనపై ఆయన చెక్కిన ‘లంగరు’ పలువురిని ఆకట్టుకుంటోంది. 1.5 సెం.మీ. ఎత్తు, 4 మి.మీ. వెడల్పుతో లంగరును చెక్కారు. కేవలం రెండు గంటల సమయంలోనే దీన్ని చెక్కినట్టు ఆయన తెలిపారు. నేవీ సేవలకు కృతజ్ఞతగా దీన్ని రూపొందించానన్నారు.
జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న చిన్నదొడ్డుగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్ మైక్రో ఆర్టిస్టుగా ఎన్నో పురస్కారాలను పొందారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అభినందనలు అందుకున్నారు.