గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-01T05:44:31+05:30 IST
కారులో తరలిపోతున్న ఇరవై కిలోల గంజాయిని కంచరపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాటిచెట్లపాలెం, నవంబరు 30: కారులో తరలిపోతున్న ఇరవై కిలోల గంజాయిని కంచరపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సబ్బవరం మండలానికి చెందిన కర్రి అర్జున్ (22), తాసుపల్లి రాజు (27), కాకర రవితేజ (23)లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు...గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగులేన్ల రహదారి ఊర్వశి కూడలిలో సోమవారం తెల్లవారు జామున నిఘా పెట్టారు. అటుగా వచ్చిన కారును తనిఖీచేయగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో కారును, సరుకును స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు.