167 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

ABN , First Publish Date - 2020-12-06T06:10:52+05:30 IST

విశాఖ ఏజెన్సీ లంబసింగి నుంచి మైదాన ప్రాంతానికి శనివారం కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.రమేశ్‌ తెలిపారు.

167 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 5 : విశాఖ ఏజెన్సీ లంబసింగి నుంచి మైదాన ప్రాంతానికి శనివారం కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.రమేశ్‌ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు గురందొరపాలెం వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, కారులో 167 కిలోల గంజాయిని గుర్తిం చామన్నారు. ఈ ఘటనలో అత్తిలికి చెందిన మూర్తాండ వినయ్‌కుమార్‌, జువ్వా దానయ్యలను అరెస్టు చేసినట్టు చెప్పారు. 

Read more