గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2020-12-13T06:14:56+05:30 IST

గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు.

గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా

  ఏఎస్పీ తుహిన్‌ సిన్హా

  కృష్ణాదేవిపేట, డిసెంబరు 12 : గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌ను శనివారం తనిఖీ చేసి, రికార్డులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి,  సారా విక్రయాలు వంటివి జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు చెప్పారు. అనంతరం అల్లూరి పార్కును సందర్శించి అల్లూరి సీతా రామరాజు, గంటందొరల సమాధుల వద్ద నివాళులర్పించారు.  కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ జి.పైడిరాజు, ఏఎస్‌ఐ గురుమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T06:14:56+05:30 IST