110 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-07T05:52:48+05:30 IST

సీలేరు నుంచి నర్సీపట్నానికి కారులో గంజాయి తరలిస్తుండగా రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు.

110 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయితో నిందితుడు

నర్సీపట్నం అర్బన్‌, నవంబరు 6 : సీలేరు నుంచి నర్సీపట్నానికి కారులో గంజాయి తరలిస్తుండగా రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ చెల్లంగి శ్రీనివాసరావు సీలేరుకు శుక్రవారం ప్రయాణికులను తీసుకొచ్చాడు. తిరుగు ప్రయాణంలో పాత పరిచయంతో గోపాల్‌ అనేవ్యక్తితో ఫోన్‌లో మాట్లాడాడు. సీలేరు నుంచి నర్సీపట్నానికి గంజాయి చేర్చేందుకు రూ.6 వేలు కిరాయికి గోపాల్‌తో ఒప్పందం చేసుకున్నాడు.  గబ్బాడ గ్రామం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు వాహనంలో 110 కిలోల గంజాయి పట్టుపడింది. శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసి, గోపాల్‌ కోసం గాలిస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-11-07T05:52:48+05:30 IST