500 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST

ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు చింతపల్లి ఎస్‌ఐ అహ్మద్‌ అలీ అన్నారు.

500 కిలోల గంజాయి పట్టివేత
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, లారీ

లారీ స్వాధీనం: డ్రైవర్‌ అరెస్టు

రూ.12 లక్షలు ఉంటుందని అంచనా


చింతపల్లి, డిసెంబరు 1: ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 500 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు చింతపల్లి ఎస్‌ఐ అహ్మద్‌ అలీ అన్నారు. ఒడిశా నుంచి పొరుగు రాష్ట్రాలకు లారీలో గంజాయిని తరలిస్తుండగా లంబసింగి చెక్‌పోస్టు వద్ద అటవీ శాఖ ఉద్యోగుల సహకారంతో పట్టుకున్నామన్నారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ని అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు.

Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST