పిచ్చికుక్క దాడిలో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-27T05:00:17+05:30 IST

మండలంలోని అమలాపురంలో శుక్ర వారం అర్ధరాత్రి పిచ్చికుక్క దాడిలో నలుగురు గాయపడ్డారు.

పిచ్చికుక్క దాడిలో నలుగురికి గాయాలు

నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 26 : మండలంలోని అమలాపురంలో శుక్ర వారం అర్ధరాత్రి పిచ్చికుక్క దాడిలో నలుగురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన పైల వరలక్ష్మి, పెట్ల రమణమ్మ, మాకిరెడ్డి సాంబమూర్తి, షేక్‌ షబీర్‌లకు కుక్క కరవడంతో గాయాలయ్యాయి.  అలాగే రెండు మేక పిల్లలు, గేదె దూడ, కుక్క పిల్లను కూడా కరిచింది. అయితే కుక్క పిల్ల చనిపోయినట్టు గ్రామస్థులు తెలిపారు. పిచ్చి కుక్కదాడిలో గాయపడ్డ వారికి వేములపూడి పీహెచ్‌సీలో  చికిత్సలు అందించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-12-27T05:00:17+05:30 IST