పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-12-06T05:45:38+05:30 IST

జీవీఎంసీ 86వ వార్డు వుడా ఫేజ్‌-3లో 15 లక్షలు రూపాయిలతో పార్కు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేసారు.

పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

కూర్మన్నపాలెం: జీవీఎంసీ 86వ వార్డు వుడా ఫేజ్‌-3లో 15 లక్షలు రూపాయిలతో పార్కు  అభివృద్ధి పనులకు శనివారం  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఫరిధిలో కోటి రూపాయిలతో రోడ్లును అబివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, ఈఈ వేణుగోపాల్‌, వైసీపీ అభ్యర్థి దామా సుబ్బారావు, ముద్దపు మురళీమోహన్‌, పత్తిపాటి శ్రీను, ప్రసాద్‌, చేగొండి శ్రీను, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రహరీ నిర్మాణానికి..

గాజువాక: అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఽధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 65వ వార్డు కేఎల్‌ రావు నగర్‌ పార్కు స్థలంలో రూ.11.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీకి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. 

Read more