రైతులే నిజమైన శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2020-11-13T06:31:29+05:30 IST
వ్యవసాయంలో అనేక మార్పులకు రైతులే కారణమని, ఒకవిధంగా చెప్పాలంటే అసలైన శాస్త్రవేత్తలు వారేనని అనకాపల్లి ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి అన్నారు.
ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి
మునగపాక, నవంబరు 12 : వ్యవసాయంలో అనేక మార్పులకు రైతులే కారణమని, ఒకవిధంగా చెప్పాలంటే అసలైన శాస్త్రవేత్తలు వారేనని అనకాపల్లి ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి అన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నాగులాపల్లిలో వ్యవసాయ ఉత్పత్తులు, పనిముట్ల ప్రదర్శనను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ పనిముట్లు పనితీరుపై విద్యార్థులు చక్కగా వివరించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్‌కుమార్, వ్యవసాయాధికారులు పావని తదితరులు పాల్గొన్నారు.