పలు విమాన సర్వీసులు రద్దు

ABN , First Publish Date - 2020-03-23T09:32:41+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన జనతా కర్ఫ్యూ నేపఽథ్యంలో విశాఖ నుంచి రాకపోకలు సాగించే అనేక విమాన సర్వీసులు రద్దు ...

పలు విమాన సర్వీసులు రద్దు

ఎన్‌ఏడీ జంక్షన్‌, మార్చి 22 : కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన జనతా కర్ఫ్యూ నేపఽథ్యంలో విశాఖ నుంచి రాకపోకలు సాగించే అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సుమారు 80 శాతం విమాన సర్వీసులు రద్దవ్వడంతో పాటు నడుస్తున్న విమానాలలో కూడా పరిమిత సంఖ్యలో ప్రయాణాలు చేశారు. అధిక శాతం మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో ప్రయాణికుల లేక విమానాశ్రయం వెలవెలబోయింది. ఇక ప్రయాణికుల రాకపోకలు ఉండవనే ఉద్దేశంతో ట్యాక్సీ, ఆటో సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా సమ దూరం పాటిస్తూ విధులు నిర్వర్తించారు. విశాఖ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.


అధికారికంగా రద్దయిన విమాన సర్వీసులివే..

- ఉదయం 10.35 గంటలకు ఎయిర్‌ఏషియా బెంగళూరు-విశాఖ 

- ఉదయం 11.45 కు ఇండిగో హైదరాబాద్‌-విశాఖ

- మధ్యాహ్నం 12.10కు స్పైస్‌జెట్‌ ఢిల్లీ-విశాఖ

- మధ్యాహ్నం 12.15కు ఇండిగో విశాఖ-చెన్నై

- మధ్యాహ్నం 12.30కు ఎయిరిండియా విశాఖ-ఢిల్లీ

- మధ్యాహ్నం 1.25కు ఇండిగో బెంగళూరు-విశాఖ

- మధ్యాహ్నం 1.55కు ఇండిగో విశాఖ-బెంగళూరు

- మధ్యాహ్నం 1.50కు ఇండిగో హైదరాబాద్‌- విశాఖ

- మధ్యాహ్నం 2.20కు ఇండిగో విశాఖ-హైదరాబాద్‌

- మధ్యాహ్నం 2.10కు ఇండిగో బెంగళూరు-విశాఖ

- మధ్యాహ్నం 2.40కు ఇండిగో విశాఖ-బెంగళూరు

- మధ్యాహ్నం 3.50కు ఇండిగో హైదరాబాద్‌-విశాఖ

- సాయంత్రం 4.20 గంటలకు ఇండిగో విశాఖ-హైదరాబాద్‌

- సాయంత్రం 5.05ఉ ఇండిగో చెన్నై-విశాఖ

- సాయంత్రం 5.35కు ఇండిగో విశాఖ-చెన్నై

- సాయంత్రం 6.55కు ఇండిగో హైదరాబాద్‌-విశాఖ

- రాత్రి 7 గంటలకు ఇండిగో రాజమండ్రి- విశాఖ

- రాత్రి 7.20కు ఇండిగో విశాఖ-రాజమండ్రి

- రాత్రి 7.35కు ఇండిగో విశాఖ-హైదరాబాద్‌

- రాత్రి 7.55కు ఇండిగో చెన్నై-విశాఖ

- రాత్రి 8.30కు ఇండిగో విశాఖ-హైదరాబాద్‌


Updated Date - 2020-03-23T09:32:41+05:30 IST