-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Fisherman request
-
‘మంత్రి దృష్టికి మత్స్యకారుల సమస్యలు’
ABN , First Publish Date - 2020-12-06T06:08:58+05:30 IST
నియోజక వర్గంలోని మత్స్యకారుల సమస్యలను మత్స్యకార, పశు సంవర్థ శాఖా మంత్రి సీదరి అప్పలరాజు దృష్టికి తీసుకు వెళ్లినట్టు మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు ఇక్కడి విలేఖరులకు తెలిపారు.

పాయకరావుపేట రూరల్, డిసెంబరు 5 : నియోజక వర్గంలోని మత్స్యకారుల సమస్యలను మత్స్యకార, పశు సంవర్థ శాఖా మంత్రి సీదరి అప్పలరాజు దృష్టికి తీసుకు వెళ్లినట్టు మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు ఇక్కడి విలేఖరులకు తెలిపారు. శనివారం తాడేపల్లిలో మంత్రి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలను మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు ఆధ్వర్యంలో కలిసినట్టు చెప్పారు. తీర ప్రాంత గ్రామాల్లో సముద్రానికి వెళ్లే రహదారుల అభివృద్ధి, విద్యుత్ లైట్ల ఏర్పాటు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితరాలపై విన్నవించినట్టు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో నెలకొల్పే పరిశమ్రల వల్ల మత్స్య సం పద నశించి, మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నందున మత్స్యకారుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.