మంత్రి దృష్టికి మత్స్యకారుల సమస్యలు

ABN , First Publish Date - 2020-11-20T05:19:17+05:30 IST

హత్య కేసులో సుమారు మూడేళ్ల నుంచి జీవిత ఖైదు అనుభవిస్తున్న నక్కపల్లి మండలం బంగారమ్మపేట మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలంటూ మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజును జాతీయ మత్స్యకార సంఘం జిల్లా ప్రతినిధులు కోరారు.

మంత్రి దృష్టికి మత్స్యకారుల సమస్యలు
మంత్రికి వినతిపత్రం అందిస్తున్న మత్స్యకార సంఘం ప్రతినిధులు

నక్కపల్లి, నవంబరు 19 : హత్య కేసులో సుమారు మూడేళ్ల నుంచి జీవిత ఖైదు అనుభవిస్తున్న నక్కపల్లి మండలం బంగారమ్మపేట మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలంటూ మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజును జాతీయ మత్స్యకార సంఘం జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం అమరావతిలో మంత్రిని  జిల్లా మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు మోసా అప్పలరాజు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొవిరి వెంకటేశ్‌ తదితరులు కలిశారు.  వేట నిషేధ పరిహారాన్ని ప్రభుత్వం పెంచిందని, అయితే మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని తాము మంత్రిని కోరినట్టు ఇక్కడి విలేఖరులకు ఫోన్‌ ద్వారా తెలిపారు.  సంఘం ప్రతినిధులు గరికిన సింహాద్రి, పిక్కి రాంబాబు, గోసల కాసులమ్మ, ఎరుపిల్లి నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T05:19:17+05:30 IST